సిరాన్యూస్, ఓదెల
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: ఏఎస్సై సుధాకర్
* పోత్కపల్లి శివారులో వాహనాల తనిఖీలు
వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఏఎస్సై సుధాకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోత్కపల్లి శివారు లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై , ఇన్సూరెన్స్ , నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించారు. ఈ సందర్బంగా ఏఎస్సై సుధాకర్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు , లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, మైనర్లకు తల్లి తండ్రులు వాహనాలు ఇవ్వద్దని, పరిమితికి మించిన వేగంతో వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అశోక్. శివ సిబ్బంది పాల్గొన్నారు.