సిరా న్యూస్,హనుమకొండ;
కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున ఏడుగురు యువకులు వీరంగం సృష్టించారు. ట్యాక్సీ కార్ డ్రైవర్ తో గొడవ పడి కార్ల అద్దాలు పగలగొట్టారు.ఘటనలో రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. క్యాబ్ డ్రైవర్ కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్ ప్రాంతంలో మూత్ర విసర్జన చేస్తుండటంతో వారిని క్యాబ్ డ్రైవర్ రాజు ప్రశ్నించారు. దాంతో ఆ యువకులు అతనిపై దాడికి దిగి అక్కడే ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేసారు. బాధితుడు కాజీపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసాడు. వీరంగం చేసిన యువకులలో సిద్దిపేట జిల్లాలోని రిజర్వ్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ కొడుకు హర్ష వున్నాడు. తన తండ్రి సిద్దిపేటలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడని… నన్ను ఎవరు ఏమి చేయలేరని కొడుకు వీరంగం సృష్టించారు. కాజీపేట పోలీస్ స్టేషన్ లోనూ కానిస్టేబుల్స్ తో వాగ్వాదానికి దిగాడు.