Assistant Commissioner K Vijayalakshmi: పెద్దాపురం మరిడమ్మ దేవస్థానంలో అన్న ప్రసాద వితరణ :దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కే విజయలక్ష్మి

సిరాన్యూస్, సామర్లకోట
పెద్దాపురం మరిడమ్మ దేవస్థానంలో అన్న ప్రసాద వితరణ :దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కే విజయలక్ష్మి
* చెక్కును అందజేసిన సామర్లకోట సిరాన్యూస్ రిపోర్టర్

పెద్దాపురం పట్టణంలో వెలసిన మరిటమ్మ అమ్మవారి ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శుక్రవారం పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా సామర్లకోట సిరా న్యూస్ రిపోర్టర్ 2000 రూపాయల చెక్కును ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కే విజయలక్ష్మికి అందజేశారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కే విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ రూ. 45 లక్షల ఎఫ్డి రూపంలో అమ్మవారి అన్నదాన విరాళాలు వ‌చ్చాయ‌ని తెలిపారు. 2008 సంవత్సరంలో మొట్టమొదటిసారి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో ఏర్పాటు చేశారని, 2010 వరకు కొనసాగించారని తెలిపారు. 2019 డిసెంబర్లో 2020 వరకు కోవిడ్ కారణంగా అన్నదానం కార్యక్రమాన్ని నిలిపి వేయాల్సి వచ్చిందని , 2024 నవంబర్ 15 న మక నక్షత్రం,పౌర్ణమి నాడు మరిడమ్మ అమ్మవారి జన్మ నక్షత్రం అవడం వల్ల చండీ హోమం నిర్వహించి శుక్రవారం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి చేతుల మీదగా ప్రారంభించారు. 2019లో బీజేపీ పెద్దాపురం మండల అధ్యక్షుడు అల్లు ప్రసాద్ అన్నదానం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని ఆలయ అసిస్టెంట్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందించారని విజయలక్ష్మి తెలిపారు. బీజేపీ నాయకులు వినతి పత్రంలో సుదూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనం కి వచ్చిన భక్తులు భోజనానికి అవస్థలు పడుతున్నారని, వారి ఆకలిని తీర్చడానికి తిరిగి పున ప్రారంభించాలని కోరడం కొంతమంది భక్తుల కోరిక మేరకు అన్నదాన కార్యక్రమమును పునః ప్రారంభిస్తున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బీజేపీ మండల ప్రధాన అధ్యక్షుడు అల్లు ప్రసాద్, చీకట్ల నాగేశ్వరరావు , అన్ని పార్టీ నాయకులు,భక్తులు పాల్గొన్నారు.

One thought on “Assistant Commissioner K Vijayalakshmi: పెద్దాపురం మరిడమ్మ దేవస్థానంలో అన్న ప్రసాద వితరణ :దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కే విజయలక్ష్మి

  1. I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *