సిరా న్యూస్,ఓదెల
అర్హులైన వారికి లేబర్ కార్డులు: సహాయ కార్మిక అధికారి డి .రవీందర్
అర్హులైన వారికి లేబర్ కార్డులు అందజేస్తామని సహాయ కార్మిక అధికారి డి .రవీందర్ అన్నారు. వరంగల్ నుండి బదిలీ అయి మంథిని సహాయ కార్మిక అధికారి గా శుక్రవారం సాయంత్రం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని మంథని, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం, నాలుగు మండలాల్లోని భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్స్, ఎలక్ట్రిషన్స్, కార్పెంటర్స్, ఇతరత్రా లేబర్ పనులు చేసే వారు లేబర్ కార్డుకు అర్హులని తెలిపారు. అర్హులైన వారు లేబర్ కార్డు కోసం మీసేవ వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు.