సిరా న్యూస్, ఆదిలాబాద్:
గొడం నగేష్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం
– దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్
బిజెపి పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గొడం నగేష్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు అస్తక్ సుభాష్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నిరాల గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి గొడం నగేష్ లను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అస్తక్ సుభాష్ మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని అన్నారు. దళిత మోర్చా ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులంతా సమిష్టిగా పనిచేసే రానున్న లోక్ సభ ఎన్నికల్లో గొడం నగేష్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆయన అన్నారు.