రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి 20 కోట్లు మంజూరు
సిరా న్యూస్,విశాఖ;
సింహాచలం రైల్వే స్టేషన్ ను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం సందర్శించారు. ఈ నేపధ్యంలో సింహాచలం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి 20 కోట్లు మంజూరు చేసారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్యే గణబాబు రైల్వే స్టేషన్ సందర్శించారు. సింహాచలం రైల్వే స్టేషన్ ను పునరాభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. భవిష్యత్తులో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు విస్తరణ, వాహన పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్, నూతన ప్లాట్ ఫారం కొరకు 20 కోట్ల రూపాయలు మంజూరు చేసామని మంత్రి అన్నారు.