సిరాన్యూస్, ఉట్నూర్
పేదల ఆకలిని తీర్చేడమే బొజ్జన్న బువ్వ ముఖ్య లక్ష్యం
* మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్
సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఎ కార్యాలయానికి వచ్చే అర్జీదారుల ఆకలిని తీర్చడమే బొజ్జన్న బువ్వ ముఖ్య లక్ష్యమని మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్ పేర్కొన్నారు. సోమవారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ‘బొజ్జన్న బువ్వ’ అన్నదానం నిర్వహించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఈ అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం ఈ అన్నదానం ఉంటుందని తెలిపారు.ఐటీడీఎ కార్యాలయానికి వచ్చే అర్జీదారులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు అచ్చ దేవానందం, వెడ్మ బొజ్జు యువసైన్యం సభ్యులు మెస్రం నగేష్, అక్షయ్, కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి మహేందర్, కాంబ్లే సునీల్, కలిం తదితరులు పాల్గొన్నారు.