athram Rahul: పేదల ఆకలిని తీర్చేడమే బొజ్జన్న బువ్వ ప్రధాన లక్ష్యం

సిరా న్యూస్, ఉట్నూర్
పేదల ఆకలిని తీర్చేడమే బొజ్జన్న బువ్వ ప్రధాన లక్ష్యం
* మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్
* అర్జీదారుల కోసం అన్నదానం
సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఎ కార్యాలయానికి వచ్చే అర్జీదారుల ఆకలిని తీర్చడమే బొజ్జన్న బువ్వ ముఖ్య లక్ష్యమని మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్ పేర్కొన్నారు. సోమవారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ‘బొజ్జన్న బువ్వ’ అన్నదానం నిర్వహించారు.ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఈ అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం ఈ అన్నదానం ఉంటుందని తెలిపారు. ఐటీడీఎ కార్యాలయానికి వచ్చే అర్జీదారులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యుం, ఎస్సి సెల్ జిల్లా కన్వీనర్ బిరుదుల లాజర్, మండల అధ్యక్షుడు అచ్చ దేవానందం,కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్ నిసార్, వెడ్మ బొజ్జు యువసైన్యం సభ్యులు మెస్రం నగేష్, అక్షయ్,సాయి,కాంబ్లే సునీల్,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *