సిరా న్యూస్, సొనాల
ఎంపీగా గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తా
* ఎంపీ ఆశావాహి ఆత్రం సుగుణ
* కాంగ్రెస్ నాయకులను కలిసిన సుగుణ
తనను ఎంపీగా గెలిపిస్తే నియోజక వర్గంలోని సమస్యలను పరిష్కరిస్తానని ఎంపీ ఆశావాహి ఆత్రం సుగుణ అన్నారు. మంగళవారం ఆమె సోనాల మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా వారిని కార్యకర్తలు ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. కార్యకర్తలతో మాట్లాడుతూ ఆదివాసి ఎస్ టి ఎస్ సి బి సి మైనారిటీ అన్ని వర్గాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే పార్లమెంట్ సెగ్మెంట్ లోని సమస్యలన్నింటినీ పరిష్కారం చూపిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, అలాగే యువనాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వం లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం లో ఏర్పడుతుందని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సొనాల పట్టణ అధ్యక్షులు చెట్ల పెళ్లి అనిల్ , యువజన కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ బత్తుల రమేష్, సినియర్ నాయకులు గాజుల పోతన్న, విజయ్ భాస్కర్ ఇశ్రు పటేల్, కసిరె పోతన్న, రామయ్, ప్రకాష్, రవి, రాజేష్, అమృత్ రావ్, జాకెష్,శేఖర్, సంగపాల్, తదితరులు పాల్గొన్నారు