సిరా న్యూస్, బోథ్
ఆత్రం సుగుణను కలిసిన కౌట(బి) గ్రామ నాయకులు
* పోడు భూముల సమస్యను పరిష్కరించండి విన్నపం
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణను శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ కౌట(బి) గ్రామ నాయకులు కలిశారు. ఈసందర్బంగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ మండలంలోని కౌటా (బి) గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులతోపాటు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గాజుల సురేందర్‌లు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుగుణను కోరారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలు పోడు భూములు సాగు చేసుకుని ఎంతోమంది గిరిజన ఇతరులు జీవనం సాగిస్తున్నారన్నారు అయితే పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోవడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందేమోనని ఆందోళన చేస్తున్నారని సుగుణక్క వివరించా.రు స్పందించిన సుగుణక్క పోడు భూముల సమస్యపై డిఎఫ్ఓతో సోమవారం మాట్లాడి రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకొస్తామని హామీ ఇచ్చిందని వివరించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు సున్నపు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాష్ట్ర పాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెపు గణేష్ తదితరులు ఉన్నారు.