సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లాలో ఏటీఎం దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 46 వేల రూపాయలు రికవరీ చేసినట్లు ఏలూరు డి.ఎస్.పి శ్రావణ్ కుమార్ తెలిపారు డీఎస్పీ కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు చెందిన ఐ పోలవరం గ్రామానికి చెందిన వ్యక్తి పళ్ళ సురేంద్ర కుమార్ అనే వ్యక్తి మీద 60 కేసులు నమోదయి ఉన్నాయని తెలిపారు సదరు ముద్దాయి కైకలూరు లోని ఏటీఎం దగ్గర ఒక వృద్ధున్ని మోసం చేసి అతని పిన్కోడ్ సహాయంతో డబ్బులు డ్రా చేసుకుని వెళ్లిపోయినట్లు కేసు నమోదు అయింది. దీంతో ఏలూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రవణ్ కుమార్ ఆదేశాల ప్రకారం కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ పి కృష్ణ సలహాలతో సదరు ముద్దాయిని కైకలూరులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తెలిపారు. ముఖ్యంగా ఏటీఎంల దగ్గర వృద్ధులు మహిళలు అపరిచిత వ్యక్తులను నమ్మి ఏటీఎం కార్డు పిన్కోడ్లు చెప్పవద్దని సూచించారు అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా ఏలూరు నగరంలో మూడు చోట్ల గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు చేశామని దీనికి సంబంధించి రెవెన్యూ పోలీసు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ప్రజలు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తగు చర్యలు తీసుకుంటూ ప్రభుత్వానికి సహకరించాలని డిఎస్పి తెలిపారు.