అడ్డూరు గ్రామంలో దారుణం

సిరా న్యూస్,అనకాపల్లి;
భార్యను కాపురానికి పంపలేదని కోపంతో అత్త మామల పై దాడిచేసిన అల్లుడు దాడిలో అత్త మరణించగా మామ తీవ్ర గాయాలకు గురై విశాఖ కే.జి.హెచ్ కు తరళించ బడ్డాడు వివరాల్లొ కి వెళితే అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు గ్రామానికి చెందిన మామిడి పై నాయుడు అనే వ్యక్తి నిన్న రాత్రి అత్త సానబోయిన లక్ష్మిపై కత్తితో దాడి చేసాడు అడ్డు వచ్చిన మామ పై కూడా దాడి చేసి గాయపరిచాడు ఈ దాడిలో అతని అత్త సానబోయిన లక్ష్మి అక్కడికక్కడే మరణించింది. తీవ్ర గాయాల పాలైన అతని మామను విశాఖపట్నం కెజిహెచ్ తరలించారు గత కొంతకాలంగా తన భార్యను కాపురానికి పంపకపోవడం కారణంగా తీవ్ర మనస్థాపానికి లోనైనా మామిడిపైనాయుడు ఈ దాడికి ఒడిగట్టాడని అసలు తన భార్య తనతో కాపురానికి రాకపోవడానికి కారణం తన అత్తయ్య ప్రధాన కారణమని భావించి ఈ దాడి చేసినట్లు పోలీసు వారు తెలిపారు ముద్దాయి మామిడి పైడినాయుడిని చోడవరం పోలీసు వారు అదుపు లోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *