సిరా న్యూస్,దేవరకొండ;
స్కూల్ ఫీజు చెల్లించలేదని ఇద్దరు చిన్నారులను చైత్ర, జాహ్నవి లను పాఠశాలలోనే బంధించిన యాజమాన్యం నిర్వాకం పై తల్లిదండ్రులు మండిపడ్డారు. ద్యార్థినులు పాఠశాల సమయం మించిపోయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురైయారు. స్కూల్ లో సిబ్బందికి ఫోన్ చేయగా ఫీజు చెల్లించకపోవడంతో తమ వద్దే ఉంచుకున్నామని సమాధానం వచ్చింది. ఫీజు చెల్లించి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు.
షాకైన తల్లిదండ్రులు, స్కూల్ వద్దకు వెళ్లి ప్రశ్నించగా ఫీజు చెల్లిస్తేనే పంపిస్తామనిసిబ్బంది తెగేసి చెప్పారు. తల్లిదండ్రులకు, సిబ్బందికి మధ్య వాగ్వివాదం జరిగింది. స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన కు దిగింది.