సిరా న్యూస్,పి గన్నవరం;
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం లో ప్రేమ పెళ్ళి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి దాడి చేసాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొడేరు లంకకు చెందిన రమేష్ ,పి. గన్నవరం మండలం L. గన్నవరం కు చెందిన కొప్పడి వరాలు ప్రేమ పెళ్ళి చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరికి మైనారిటీ తీరడంతోపోలీసులు ఇద్దరు పెద్దలకు చెప్పి అబ్బాయి కుటుంబ సభ్యులకి అప్పగించారు. మంగళవారం రాత్రి అమ్మాయి తండ్రి వెంకటరమణ పశ్చిమ గోదావరి జిల్లా కొడేరులంక అబ్బాయి ఇంటికి వెళ్ళి పెళ్ళి కొడుకు,పెళ్ళి కూతురి తోపాటు కుటుంబ సభ్యులపై కూడా తెచ్చుకున్న కత్తి తో దాడి చేసాడు. ఘటనలో పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు, పెళ్ళి కొడుకు తల్లి,చెల్లికి గాయాలుఅయ్యాయి.వారికి పి.గన్నరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.