పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి) పై దాడి

సిరా న్యూస్,విజయవాడ;
వైసిపి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు ప్రధాన అనుచరుడైన పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి) పై ఈరోజు ఉదయం 3 ద్విచక్ర వాహనాలపై వచ్చి దాడి చేసినట్లు తెలుస్తోంది. కొండపల్లి బుజ్జి ప్రతిరోజు ఉదయం పూట షటిల్ ఆడుకుంటూ ఇంటికి వచ్చే సమయంలో లోటస్ ప్రాంతంలో రిక్కీ నిర్వహించి షటిల్ ఆడుకుని ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో దాడి జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
కొండపల్లి బుజ్జి కి కొద్దిపాటి గాయాలైనట్లు తెలుస్తుంది దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *