పేకాట స్థావరంపై దాడి

– ఏడుగురు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

– రూ.2,51,130 నగదు, 7 మొబైల్స్, 4 బైక్‌లను, ఫోర్ వీలర్ స్వాధీనం

 సిరా న్యూస్,రామగుండం;
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ ఏన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జ్యోతి నగర్ లోని ఒక లాడ్జ్ లో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ సిబ్బందితో కలిసి లాడ్జిపై దాడి చేశారు. గోదావరిఖని పవర్ హౌస్ కాలనీకి చెందిన దాసరి మల్లేష్, అడ్డగుంటపల్లికి చెందిన పెట్టం జంపయ్య, మల్కాపూర్ కు చెందిన కంచరపు వెంకట్ రావు, జీఎం కాలనీకి చెందిన సాయి వెంకటేష్, గాంధీ నగర్ కు చెందిన పూస వెంకన్న, పవర్ హౌస్ కాలనీకి చెందిన తవటం రమేష్, హనుమాన్ నగర్ కు చెందిన భీమేల్లి శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.2,51,130 నగదు, 7 మొబైల్స్, 4 బైక్‌లను, ఫోర్ వీలర్ స్వాదీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న నగదు, సెలఫోన్లు, ద్విచక్ర వాహనాలు, పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం ఏన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *