Aurelli Mallesh Madiga: అధికారుల నిర్లక్ష్యంతో మార్కెట్లో నకిలీ పత్తి విత్తనాలు: ఆరెల్లి మల్లేష్ మాదిగ

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
అధికారుల నిర్లక్ష్యంతో మార్కెట్లో నకిలీ పత్తి విత్తనాలు: ఆరెల్లి మల్లేష్ మాదిగ
* నకిలీ విత్తనాలపై క‌లెక్ట‌రేట్‌లో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాలి

ఆదిలాబాద్‌ జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే మార్కెట్లో నకిలీ పత్తి విత్తనాలు యథేచ్చగా  అమ్ముతున్నారని జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ ఆరెల్లి మల్లేష్ ఆరోపించారు. సోమ‌వారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం నకిలీ పత్తి విత్తనాలపై, రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న వారిపై పీడియాక్టు కింద కేసులు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలను అమ్ముతున్న వారిపై రైతులు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలపై కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నమన్నారు. లేనిపక్షంలో రైతులతో క‌లిసి ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షలు బరుకుంట సుభాష్ మాదిగ, మండల అధ్యక్షులు చిట్టి రవి మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు పసుల శ్రీకాంత్ మాదిగ, టౌన్ అధ్యక్షులు దుబాక చందు మాదిగ, రాజేశ్వర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *