-ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి
-మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బొల్లపల్లి రాజు
సిరా న్యూస్,మంథని;
ఆటో డ్రైవర్లు ప్రమాదాల నివారణ కొరకు ట్రాఫిక్ నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బొల్లపల్లి రాజు సూచించారు.
మంగళవారం మంథని పట్టణంలోని బస్టాండ్ ఆవరణలోని ఆటో స్టాండ్ లో ఆటో డ్రైవర్లతో మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆటో డ్రైవర్లకు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలు గురించి తగు సూచనలు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తగు జాగ్రత్తలు పాటించాలని, ఆటోలకు కేటాయించిన ప్రదేశంలో మాత్రమే పార్కింగ్ చేయాలన్నారు. రోడ్లమీద ఆటోలు నిలిపి ప్రయాణికులకు, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఆటో నెంబర్ ప్లేట్ కనబడే విధంగా చూసుకోవాలన్నారు. ఆటోలో ఎక్కిన ప్రయాణికులతో ముఖ్యంగా మహిళలతో మర్యాదగా ప్రవర్తించాలని వారికి నమ్మకం కలిగేలా వ్యవహరించాలన్నారు. ఆటో డ్రైవర్లకు ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ వారికి చేరవేసే విధంగా మీరు కూడా భాగస్వాములు కావాలని సిఐ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితోపాటు ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.