సిరా న్యూస్,అమలాపురం;
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బట్నవిల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గాయపడిన వారు మామిడి కుదురు మండలం నగరం గ్రామానికి చెందినవారు. నగరం గ్రామానికి చెందిన కొంబోతుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రాత్రి పాండిచ్చేరి యానంలో వేడుకలు జరుపుకున్నారు. ఆటోలో తిరిగి వస్తుండగా బట్నవిల్లి వద్ద ముమ్మిడివరం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని అమలాపురం కిమ్స్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆటోలో ప్రయాణం చేస్తున్న వారంతా పూర్తిగా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.