సిరా న్యూస్,విజయవాడ;
జగ్గయ్యపేట మండలం త్రిపురారం గ్రామ శివారులో స్కూల్ ఆటో బోల్తా పడింది. త్రిపురారం గ్రామం నుంచి విద్యార్థులతో జగ్గయ్యపేట వెళ్తుండగా గ్రామ శివారులో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఆటో ప్రమాద సమయంలో కొద్ది మంది విద్యార్థులు గాయాలు అయ్యాయి. మొత్తం 18 విద్యార్దులు ఆటో లో ప్రయాణం చేస్తున్నారు. విద్యార్థులకు గాయాలవటంతో మరో ఆటోలో జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు.