సిరాన్యూస్,ఓదెల
బూసారపు చిరంజీవి కుటుంబానికి రూ.16,700 అందజేత
* ఆటో యూనియన్ అధ్యక్షులు తూడి శంకర్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బూసారపు చిరంజీవి ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో అనారోగ్యంతో ఇటీవల కరీంనగర్ ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతుడికి భార్య దివ్య, ఇద్దరు ఆడపిల్లలు శరణ్య(8), అరణ్య(5) ఉన్నారు.వీరి కుటుంబానికి ఓదెల ఆటో యూనియన్ అధ్యక్షులు తూడి శంకర్ ఆధ్వర్యంలో 16700 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో తూడి కుమార్ , పిట్టల రమాకాంత్ , మంద కృష్ణ, పసిడ్ల స్వామి పరశురాం, కనికి రెడ్డి రాజు, పడాల మల్లయ్య, సురేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.