సిరా న్యూస్,నల్గోండ;
నల్గొండ జిల్లా అడవి దేవులపల్లి మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ ఉపేందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికపరమైన ఇబ్బందులు. ఆటో ఫైనాన్స్ వారి వేధింపులు తట్టుకోలేక ఉపేందర్ ఆత్మహత్యకు పాల్పట్టడని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రవ్యాప్తంగా పదిమంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆటో డ్రైవర్లకు నెలకు 15 వేల జీవన భృతి ఇవ్వాలని పలువురు యూనియన్ లీడర్లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.