ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం

సిరా న్యూస్,కమాన్ పూర్;
పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి లో బిట్ బిట్ అకాడమీ ప్రముఖ డాన్స్ మాస్టర్ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు.బుధవారం రోజున పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆదర్శ యుపిఎస్ పాఠశాలలోబిట్వీట్ డాన్స్ దేవా కలాం మండలి వారి ఆధ్వర్యంలో పాఠశాలలోని కరస్పాండెంట్ భాస్కర్ కి ప్రిన్సిపాల్ సుజాత మేడం కి మరియు పాఠశాలలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయురాలు
ఉపాధ్యాయులుగా బిట్ బిట్ డాన్స్ దేవా మాస్టర్ పురస్కారాలు అందజేసిన ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కమాన్ పూర్ మండల అధ్యక్షులు అంబటి కనకయ్య హాజరైనారు .వారు పాఠశాల యాజమాన్యాన్ని మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను చిన్నారి విద్యార్థినీ విద్యార్థులను కొనియాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ దేవా డాన్స్ మాస్టర్ గురించి చాలాచక్కగా వివరిస్తూ ఎందరో కళా రంగంలో వెలుగులోకి తెచ్చిన ఘనత దేవా మాస్టర్ ది అని అన్నారు. దేవా పెద్దపల్లి జిల్లాలో విద్యార్థినీ విద్యార్థులకు డాన్స్ తో పాటు కూచిపూడి భరతనాట్యం తదితర కళా రంగాలనునేర్పుతూ వారిని ఉన్నత శిఖరానికి పంపించాలనే సంకల్పంతో ముందుకు నడుస్తున్నారని భాస్కర్ చక్కగా వివరించారు .పాఠశాల ప్రిన్సిపల్ దేవా కళాబృందం వారిని స్వాగతం పలుకుతూ లలిత కలల గురించి చాలాచక్కగా వేరుస్తూ అందులో ఒక భాగంగా దేవా మాస్టర్ ని విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు వివరించారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *