సిరా న్యూస్,పెద్దపల్లి;
జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డ్రగ్స్ అండ్ ర్యాగింగ్, సైబర్ క్రైమ్ పై పెద్దపల్లి ఎస్సై లక్ష్మణ్ రావు, ఏఎస్ఐ రామస్వామి అవగాహన కల్పించారు. ఏ దేశానికైనా యువతే శక్తి, సమాజం దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా దేశం యొక్క సవాలును స్వీకరిస్తూ ఈ రోజు మనం నషాముక్త్ భారత్ అభియాన్ క్రింద ఐక్యతగా ఉండి సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా డ్రగ్స్ రహితంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా కంప్లైంట్ బాక్స్ ను ఏర్పాటు చేశామని, ఎవరైనా డ్రగ్స్, ర్యాంగింగ్, ఇవ్ టిజింగ్ కి పాల్పడినట్లయితే వారి పేరు అడ్రస్ తో పాటు ఫిర్యాదు బాక్స్ లో వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత అల్లెంకి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ రవీందర్, లెక్చరర్స్ పాల్గొన్నారు.