సిరా న్యూస్,పెద్దపల్లి;
మహిళల భద్రతపై అవగాహన సదస్సును పట్టణంలోని మూన్ ఫంక్షన్ హాల్ నిర్వహించారు. ఇందులో మహిళలకు నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో మహిళల భద్రత అవగాహన సదస్సులో భాగంగా షీ టీం ఇంచార్జ్ ఏ ఎస్ ఐ మల్లన్న మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, ఆంటీ డ్రగ్స్ తదితర అంశాలపై వివరించారు. మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో జన సమీకరణప్రాంతాలు, కాలేజీల వద్ద షీ టీం నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు.ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకుగురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. ఆకతాయిలనుండి ఎలా రక్షణగా ఉండాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది స్నేహ లత, కానిస్టేబుల్ సురేష్, మహిళలు పాల్గొన్నారు.