అక్రమాలు తొలగించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు
సిరా న్యూస్,రంగారెడ్డి;
గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రా మద్దతుగా గండిపేట చెరువు పై అవగాహన సదస్సు నిర్వహించారు. చెరువు చుట్టూ ఏర్పడిన అక్రమాలను తొలగించేందుకు, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ తో పాటువిద్యార్థులు కూడా పాల్గొన్నారు. గత పది సంవత్సరాల క్రితంహిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టుపక్కప్రాంతంలోచాలా భూములు ఉండేటివి. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమిని కబ్జా చేసి బహుళ అంతస్తు భవనాలు నిర్మించారు. దీన్నివల్లా నీటి కాలుష్యం గాలి కాలుష్యంఏర్పడుతుంది అన్నారు. భూమి కబ్జాకు గురైప్రమాదం నికిఉంది అన్నరు. భవిష్యత్ తరాల పిల్లల కోసం ఆలోచన చేసిపర్యావరణాన్ని కాపాడం కోసంఈప్రభుత్వం హైడ్రా ఆపరేషన్ఎంతో అద్భుతంగా ఉంది అని అన్నారు. గతం ప్రభుత్వం హయాంలో రాజకీయ నాయకులు అండదండలతో ఎంతోమంది ప్రజాప్రతినిధుల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట ప్రాంతంలో అనేక అక్రమ నిర్మాణాలు వెలిసాయి. హైడ్రా పేరు చెప్తేనే ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు హైడ్రా ఆపరేషనుప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ఎంతో కృతజ్ఞతలు తేలిపారు. కొన్నివేల ఎకరాలతొలగించడంతోపాటు,ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిసారాల్లో, పర్యావరణాన్ని రక్షించడం కోసం ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.