విశాఖపట్టణం విమానాశ్రయం లో ఆత్మీయ స్వాగతం
సిరా న్యూస్,అనకాపల్లి;
స్పీకర్ పదవీ స్థానానికి ఎన్నికైన తదుపరి మొదటిసారిగా ఉమ్మడి విశాఖ జిల్లాకు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నకు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది చంద్ర బాబు నాయుడు స్పీకర్ పదవి ద్వారా అత్యున్నత గౌరవం ఇచ్చి ప్రధాన బాధ్యతలు అప్పగించారని చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పరిమితులకు లోబడి హుందాగా పని చేస్తానని పేర్కొన్నారు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఆయన కు అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి,ఎస్పీ మరళీకృష్ణ, పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు.