సిరా న్యూస్, ఆదిలాబాద్:
జైనథ్ లో ఇంటింటికి అక్షింతల పంపిణీ కార్యక్రమం…
+ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
+ భారీగా తరలివచ్చిన భక్తజనం
+ పెద్ద ఎత్తున శోభాయాత్ర
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో అయోధ్య రామాలయ అక్షింతలను ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారము వేకువజామున శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామజన్మభూమి ట్రస్ట్ అందించిన అక్షింతలు, శ్రీరాముని చిత్రపటాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భజనలు, కీర్తనలు గావించారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ… ప్రతీ ఇంటికి అయోధ్య రామాలయ అక్షింతలు పంపిణీ చేస్తామని అన్నారు.