సిరా న్యూస్, దస్తురాబాద్:
ఇంటింటికి రాములోరి అక్షింతలు…
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో అయోధ్య రాముని అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన, రామ ప్రాణ ప్రతిష్ఠ గావించిన అక్షింతలతో పాటు రాములోరి ఫోటో ఉన్న కరపత్రాలను ప్రతీ ఇంటికి అందిస్తామని భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పువాయిద్యాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కొడిమెల లక్ష్మణ్, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.