-గాంధీచౌక్ లో ఇంటింటికి అయోధ్య అక్షింతలు పంపిణీ
సిరా న్యూస్,మంథని;
మంగళహారతులతో అయోధ్య రామయ్య అక్షింతల శోభయాత్ర బుధవారం మంథని పట్టణంలోని గాంధీ చౌక్ ప్రాంతానికి చేరుకున్నాయి. పట్టణంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయo నుండి మాజీ సర్పంచ్ ఓడ్నాల శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీరాముని అక్షింతలను మంగళ వాయిద్యాలతో పట్టణ పురావీధుల గుండా శోభయాత్ర ద్వారా గాంధీ చౌక్ కు తీసుక వచ్చి ఇంటిటికి పంపిణి చేశారు. గాంధీ చౌక్ తో పాటు పద్మశాలి వీధికి చెందిన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.రామ నామస్మరణతో పట్టణంలో శోభ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ప్రవల్లిక, గాంధీ చౌక్ చెందిన సభ్యులు కొమురోజు చంద్రమోహన్, పెండ్యాల రామ్ కుమార్, సిరిపురం రమేష్, గుడిమల్ల కుమార్, ఒల్లాల వెంకన్న, లింగం నారాయణ, కొమురోజు మధుకర్, కొమురోజు వేణు, రాపర్తి సంతోష్, బండారి రాజేష్, పద్మశాలి వాడకు చెందిన నాయకులు సభ్యులు పెంటరీ రాజు, నాగుల రాజు, పెండెం నరేందర్, గజెల్లి శ్రీనివాస్, కూర కోటేష్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, రాజమౌళి గౌడ్, గర్రెపల్లి వెంకన్న, నరేందర్ రెడ్డి, కనుకుంట్ల స్వామి తో పాటు మహిళలు రేపాల ఉమాదేవి,కూర విజయ,తిరుమల తో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.