– ఆఖిలభారతీయ అయ్యప్ప ధర్మప్రచారసభ సభ్యుడు జనగామ తిరుపతి
సిరా న్యూస్,కమాన్ పూర్;
భక్తిశ్రద్ధలతో అనేక నియమాలతో, ఎంతో నిష్ఠతో నిత్యం స్వామియే శరణమయ్యప్ప అనే మూలమంత్రం స్మరిస్తు అయ్యప్ప మండలకాల దీక్ష ముగించుకుని సోమవారం ఎన్ టి పి సి, టౌన్ షిప్ అయ్యప్పదేవాలయంలో బ్రహ్మశ్రీ రాంపళ్లి వామనశర్మ గారి నేతృత్వంలో అఖిలభారతీయ అయ్యప్ప ధర్మప్రచారసభ సభ్యుడు జనగామ తిరుపతి, గురు స్వాములు క్రిష్ణప్రసాద్, నందం నాగవర్ధన్ రావు లు ఇరుముడి కట్టుకున్నారు. అనంతరం గాయత్రిమాత దేవాలయం అర్చకులు రాజనరేంద్ర శర్మ, వెంకటేశ్వర ఆలయం పూజారులు వానమామలై రామాచారి, జయేంద్ర సరస్వతిగార్ల ఆశీర్వచనాలు తీసుకుని శబరిమలైయాత్రకి బయలుదేరారు. ఈ సంధర్భంగా అఖిలభారతీయ అయ్యప్ప ధర్మప్రచారసభ సభ్యుడు జనగామ తిరుపతి మాట్లాడారు. ప్రతిమనిషి జీవితంలో ఒక్కసారి అయినా అయ్యప్పదీక్ష తీసుకుని శభరిమలై వెళ్ళి తలపై ఇరుముడితో పదునెట్టాంబడి ఎక్కి అయ్యప్పస్వామిని దర్శనం చేసుకోవాలి అని అన్నారు. అయ్యప్ప దీక్షముగిసిన కూడ నిరంతరం స్వామివారిని తలుచుకుంటూ ఉండాలి అని అలాగే లోక కల్యానార్థం కోసం మళ్లీ అయ్యప్ప మాలధరించే అవకాశం కల్పించమని కోరినట్లు తెలిపారు. ఇరుముడి సంచిలో ఖచ్చితంగా నెయ్యి నింపిన కొబ్బరికాయని తీసుకువెల్లి ఆనేతితో హరిహర సుతున్ని అభిషేకించి కొబ్బరికాయని మాత్రం సన్నిధానం ఆవరణలో ఉన్న అగ్నిగుండంలోని అగ్నికి ఆహుతి చేస్తారు అనితెలిపారు. శరీరంఅనే కొబ్బరికాయలో తనప్రాణాన్ని నెయ్యిగా పోసి స్వామివారికి అర్పన చేస్తారు అని అన్నారు.
కొబ్బరికాయ పైన ఉండే మూడు కన్నులు శివుని నేత్రాలుగా, కొబ్బరికాయ చుట్టూ ఉండే నిలువు చారలు విష్ణు నామాలుగా భావిస్తారు అని కొబ్బరికాయలో నెయ్యి పోయడమంటే సాక్షాత్ అయ్యప్పను అభిషేకించటం అనేది ఇక్కడ భక్తుల విశ్వాసం అని అలాగే భగవంతుని రూపాన్ని ధారణ చేసిన భావనలో ఉంటారు అని తెలిపారు .
అప్పటివరకూ భగవంతుని రూపమై ,ఆభగవంతుని సన్నిధికి చేరేందుకు చేయూతనిచ్చిన ఆ శరీరంపైన అభిమానాన్ని వదిలేసి, దానిని కొబ్బరి కాయ రూపంలో అగ్నికి ఆహుతి చేస్తారు అని దానిలోని పరమార్థాన్ని తెలిపారు.
యాత్రకు బయలుదేరె ముందు తనఇంటిని సురక్షితంగా కాపాడమని గ్రామదేవతని కోరి యాత్రకు బయలుదేరినట్లు తెలిపారు. అయ్యప్పలు ఇంటి ముందర కొబ్బరికాయ కొట్టి ప్రార్ధించగానే, తన పరివార గణములోని ఒక గణమును ఇంటి రక్షణ కోసం ఆదేవత కేటాయిస్తుంది అనేది ఒక నమ్మకం అని తెలిపారు. శబరియాత్ర నుండి తిరిగి వచ్చాక, అయ్యప్పలు ఇంటి గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి, ఆశక్తిని పంపిన గ్రామ దేవతకి నమస్కారం చేసి కృతఙ్ఞతలు చెప్పుకొని గృహప్రవేశం చేయాలి అని అఖిలభారతీయ అయ్యప్ప ధర్మప్రచారసభ సభ్యుడు జనగామ తిరుపతి అన్నారు