B Hussain:ప్రపంచ దేశాలకు యోగా గురువు భారతదేశం: మెజిస్ట్రేట్ బి హుస్సేన్

సిరాన్యూస్‌, బోథ్‌
ప్రపంచ దేశాలకు యోగా గురువు భారతదేశం: మెజిస్ట్రేట్ బి హుస్సేన్

ప్రపంచ దేశాలకు యోగా గురువు భారతదేశమ‌ని మెజిస్ట్రేట్ బి హుస్సేన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం నిర్వహించిన యోగ శిబిరానికి బోథ్‌ మున్సిపల్ మెజిస్ట్రేట్ బి హుస్సేన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అనాది కాలం నుండి భారత దేశంలో యోగ కు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. భారతదేశంలో ఉన్న మహర్షి ఎందరో యోగ ద్వారా తమ జీవితకాలన్నీ పెంచుకోవడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశం యోగా గురువు అని, భారత దేశంలో యోగాకు లభిస్తున్న ఆదరణను చూసి ప్రపంచ దేశాలు ఆచరిస్తున్న అన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక శారీరక శారీరక శ్రమ తగ్గడమే కాకుండా ఆలోచన శక్తి పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మండల యోగా పీట అధ్యక్షులు కుమ్మరి పోశెట్టి ఉపాధ్యక్షులు ఆర్.డి ప్రసాద్, పీపీ శ్రీధర్ జాయింట్ సెక్రటరీ, పంద్రం శంకర్, న్యాయవాదులు అరేబి, హరీష్ కుమ్మరి, విజయ్ కుమార్, కోర్టు సూప‌రింటెండెంట్ శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అంతేగాక మండలంలోని సోనాల వివేకానంద పాఠశాలలో విద్యార్థులు యోగాసనాలు వేయడం జరిగింది. మండల కేంద్రంలోని వేదం పాఠశాలలో విద్యార్థులు యోగ ఆసనాలు వేశారు. ప్రిన్సిపాల్ పచ్చిపాల సంతోష్ పాల్గొన్నారు. విద్యార్థులకు వివిధ రకాల ఆసనాలపై అవగాహన క‌ల్పించారు. సోనాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది యోగ పై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో డాక్టర్ నవీన్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *