మనవడిని అమ్మేసిన నాయనమ్మ
పోలీసుల జోక్యంతో కథ సుఖాంతం
సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. దత్తత పేరుతో బాలుడిని అమ్మిన నాయనమ్మ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరం నిజంపేటకు చెందిన పందుల సాయి, స్వప్న 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు 2022 డిసెంబర్ లో బాబు పుట్టాడు. బాబు పుట్టిన నెల రోజులకే 2023 లో సాయి రోడ్డు ప్రమాదంలో మరణించాడు ..ఆతరువాత. నాయనమ్మ నాకు వున్న ఒక్క కొడుకు చనిపోయాడు. ఈ బాబును నాకు ఇవ్వు నా కొడుకును మనవడిలో చూసుకుంటా అని చెప్పి స్థానిక 42 డివిజన్ కార్పొరేటర్ భర్త శేషగిరి రావు సమక్షంలో బలవంతంగా దత్తత కు ఒప్పించారు. అయితే 10 రోజులు గడవక ముందే మీ అత్త వేరే వారికి దత్తత ఇస్తుంది అట వచ్చి సంతకం పెట్టీ పో ఆని శేషగిరి రావు చెప్పారు. మా అత్త పెంచుకుంటుందని దత్తత స్వీకరించింది. మళ్లీ వేరే వాళ్లకు ఇవ్వటం ఏమిటి అనే ప్రశ్నించిన స్వప్న దాంతో ఆడబిడ్డ భర్త శేషగిరిరావు అమ్మాయిని సంతకం పెట్టాలని ఒత్తిడి చేయడం జరిగింది. ఆ బాబును చూపెట్టండి అని అడిగిన చూపెట్టడం లేదు నా బాబుని వేరే వాళ్లకు అమ్మినట్టు తెలిసింది.ఇదే విషయం అడుగుతే ముందు సంతకం పెట్టు. నువ్వు ఎక్కడైనా దిక్కున్న దగ్గర చెప్పుకో అని బెదిరించడం జరిగింది. నా బాబు నాకు కావాలి అని రోదిస్తున్న తల్లి స్వప్నతీరు పలువురిని కంటతడి పెట్టించింది. పోలీసుల రంగప్రవేశం చేసి ఈ రోజు బాబును తెప్పించిన అత్త నాగమణి, పోలీస్ స్టేషన్లో తల్లి స్వప్న బాబును లాక్కునేందుకు కొంత పెనుగులాట జరిగింది. చివరకు బాబును శిశు సంక్షేమ అధికారులవద్ధకు పంపి వారి సమక్షంలో తల్లికి అప్పజెప్పరు.