సిరా న్యూస్, కళ్యాణదుర్గం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
* ఆర్‌డీఓ రాణిసుస్మిత మహిళలకు ఆదర్శం
* ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్
సమాజంలో పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్బంగా రెవెన్యూ డివిజినల్ కార్యాలయం ఆర్‌డీఓ రాణి సుస్మితను ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు లోకేష్, హరి, రఘు, జోసఫ్ కిషోర్ లు ఘనంగా సన్మానించారు. అనంతరం మెమోంటోను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. మహిళలకు మీరు ఆదర్శం అన్నారు.రాణి సుస్మితను ఆదర్శం గా తీసుకొని మహిళలు రాణించాలన్నారు. ప్రదమైన వృత్తిలో రానిస్తుండడం చాలా సంతోషకరమన్నారు. విద్యా ను ప్రోత్సాహించడం ఇన్ఫినిటీ చారిటబుల్ లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.