సిరా న్యూస్, కుందుర్పి
ఉపాధ్యాయుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ సాయం
బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న ఉపాధ్యాయుడికి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ బద్దే నాయక్ సాయం చేశారు. సోమవారం పట్టణంలోని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఎంఈఓలు శ్రీధర్, ఓబుళపతి, తిప్పేస్వామి లతో కలిసి బాధితులకు రూ.20వేల చెక్కును అందించారు. వివరాల్లోకెళ్తే… హిందూపురం పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు కె.ముస్తాక్ అహమ్మద్ ఖాన్ బొమ్మనహల్ మండలం చంద్రగిరి పాఠశాలలో పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గం బస్టాండ్ లో ఆపస్మారక స్థితిలో ఉన్న ఇతనికి శెట్టూరు ఎంఈ ఓ శ్రీధర్ చొరవ తీసుకోవడం వల్ల మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో అనంతపురం పంపించారు. వైద్యులు ముస్తాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని నిర్దారించారు. చికిత్స కోసం రోజుకు లక్ష యాభై వేలు ఖర్చు వస్తోందని అంత డబ్బు తమ దగ్గర లేదని దాతలు ఆదుకోవాలని కోరగా ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బద్దేనాయక్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన బాధిత కుటుంబ సభ్యులకు ముస్తాక్ అహమ్మద్ ఖాన్ పేరుమీదుగా రూ.20,000/-చెక్కును శెట్టూరు, బ్రహ్మసముద్రం, కుందుర్పి ఎంఈఓ లు శ్రీధర్ , ఓబుళపతి తిప్పేస్వామి చేతుల మీదుగా అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అబ్దుల్ వాహబ్, ఉపాధ్యాయులు ఆదిఆంధ్ర తిప్పేస్వామి అశోక్ ,చాపిరి తిప్పేస్వామి,లోకేష్ పాల్గొన్నారు.