సిరాన్యూస్, కళ్యాణదుర్గం
విద్యార్థి తిప్పేరుద్రకు రూ.10వేలు అందజేత :ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్
కళాశాలలో ఫీజు కట్టలేక కూలీ వెళ్తున్న ఓ విద్యార్థి బాధను అర్థం చేసుకొని ఆ విద్యార్థికి ఆర్థిక సాయం చేసి కళాశాలకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ పంపించారు. వివరాల్లోకి వెళ్తే..కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య-నీలావతి దంపతుల 3వ సంతానం తిప్పేరుద్ర అను విద్యార్థి అనంతపురంలోని ఓ కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల ఫీజు రూ. 10,000/- కట్టలేక 2వ సంవత్సరం ప్రారంభం నుండి కళాశాలకు వెళ్లకుండా రోజు వారి కూలి పనికి విద్యార్థి వెళ్తున్నాడు. ఈవిషయాన్ని కామక్కపల్లి వాసులు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్‌కు తెలియజేయగా వెంటనే స్పందించి రూ. 10,000/- సొంత నిధులు ఇచ్చి లగ్గేజ్ తో పాటు నేరుగా కళాశాలకు పంపించారు. సహాయం చేసినందుకు బద్దేనాయక్ కు విద్యార్థి కృతజ్ఞతలు తెలిపారు .కార్యక్రమంలో ఉపాధ్యాయుల మల్లికార్జున, ఎర్రిస్వామి, చిరంజీవి, పెన్నప్ప పాల్గొన్నారు.