సిరా న్యూస్, కుందుర్పి
పేద విద్యార్థికి బాసటగా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్
* విద్యార్థిని పరీక్ష ఫీజు కట్టిన చైర్మన్ బద్దెనాయక్
పేద విద్యార్థులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దెనాయక్ బాసటగా నిలుస్తున్నారు.చిన్నతనంలో ఆయనలో తీసుకొచ్చిన రూ.500 నోటు నేడు ఎంతో మంది అబాగ్యులకు చేయూత అందిస్తున్నారు. పేదరికంతో విద్య కు దూరం కాకూడదు న్న బద్దే నాయక్ నినాదం నేడు విద్యార్థులకు వరంగా మారింది. ఇందులో భాగంగానే కంబదూరు మండలం ఓబగానిపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన సిరాజ్ భాష, మల్లికాబేగం లకు ఇద్దరు కుమార్తెలు మొదటి కుమార్తెకు వివాహం అయింది. రెండవ కుమార్తె తస్లీమ్ అనంతపురం పట్టణంలో ఓ కళాశాలలో బీ- ఫార్మసీ చివరి సంవత్సరం చదువుతోంది.ఏప్రిల్ 15 నుండి పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలు రాయాలంటే గురువారం సాయంత్రం లోగల ఫీజు కడితేనే అనుమతిస్తామని చెప్పగా, ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న విద్యార్థి ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ను గురువారం సంప్రదించారు. ట్రస్ట్ ఛైర్మెన్ బద్దెనాయక్ నేరుగా కళాశాల అకౌంట్ కు చెక్ ద్వారా రూ.22,000/-లు జమచేసి రిసిప్ట్ విద్యార్థిని తస్లీమ కు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సురేష్, సాయినాథ్, లోకేష్, అచ్యుత్ పాల్గొన్నారు.