సిరా న్యూస్,బద్వేలు;
బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పాత భవనం శిథిలావస్థలో ఉంది దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ భవనానికి ఇదే పరిస్థితి గోపవరం మండలం సముదాయంలో ఈ భవనాన్ని అప్పట్లో దాదాపు 15 లక్షల రూపాయలతో నిర్మించారు అప్పటి జిల్లా ఎస్పీ గోవింద సింగ్ అప్పటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దివంగత వీరారెడ్డి అప్పటి జిల్లా కలెక్టర్ ఈ భవనాన్ని ప్రారంభించారు భవనం ప్రారంభించిన కేవలం మూడు నెలలు మాత్రమే రూరల్ పోలీస్ స్టేషన్ కొత్త భవనంలో కొనసాగింది జాతీయ రహదారికి అత్యంత సమీపంలోనే ఈ భవనం ఉంది పోలీస్ స్టేషన్ కు సమీపంలోని ఎరసల కనుమల్లో భారీ ఎన్కౌంటర్ జరిగి దాదాపు పదిమంది మావోయిస్టులు మృతి చెందారు అప్పట్లో ఈ విషయం కడప నెల్లూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టించింది ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొన్ని నెలలు ఈ భవనంలోనే పోలీస్ స్టేషన్ కొనసాగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు రక్షణ ఉండదన్న భయంతో రూరల్ పోలీస్ స్టేషన్ బద్వేల్ కు తరలించారు అప్పటినుంచి బద్వేల్ లోనే పోలీస్ స్టేషన్ కొనసాగుతుంది బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ కు ఘనమైన చరిత్ర ఉంది బద్వేల్ లో ఒకప్పుడు కేవలం ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే ఉండేది బద్వేల్ లో ఉన్న గోపవరం మండలం పోలీస్ స్టేషన్ కు బద్వేల్ పోలీస్ స్టేషన్ గా మార్పు చేసి కొన్ని రోజులు బద్వేల్ లోనే ఉంచారు ముందు గోపవరం మండలం బ్రాహ్మణ పల్లెలో మొట్టమొదట పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత కొద్ది కాలానికి గోపవరం కాలనీ లో ఉన్న భవనాల లోకి స్టేషన్ తరలించారు ఆ తర్వాత మరికొద్దికాలానికి బద్వేల్ పట్టణానికి తరలించడం జరిగింది అప్పట్లో గోపవరం మండలానికి ప్రత్యేక పోలీస్ స్టేషన్ భవనం ఉండాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు పంపారు
ఆ మేరకు కొత్త భవనాన్ని నిర్మించారు భవనం నిర్మించిన కొన్ని నెలలకే ప్రారంభించారు కొత్త భవనం లోకి బద్వేల్ లో ఉన్న పోలీస్ స్టేషన్ ను తరలించారు
కాస్త మున్నాళ్ళ ముచ్చటగా మారింది పోలీస్ స్టేషన్ తిరిగి బద్వేల్ కు వచ్చిన తర్వాత సరైన అలనా పాలనా లేకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరుకుంటుంది ఈ భవనం ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది అని చెప్పాలి భవనం పూర్తిగా శిథిలం కాకముందే ఉన్నతాధికారులు దీని పై దృష్టి పెట్టాలి ఈ మేరకు మండల ప్రజలు కోరుతున్నారు