సిరా న్యూస్, బేల:
శంషాబాద్ లో బాజీరావ్ బాబా సప్త వేడుకలు…
+ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగిన పల్లకి శోభాయాత్ర
+ పెద్ద ఎత్తున పాల్గొన్న బాబా భక్తులు
+ ఆకట్టుకున్న భజన పోటీలు
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని శంషాబాద్ (మిర్జాపూర్) గ్రామంలో సద్గురు బాజీరావ్ బాబా సప్త వేడుకలను గ్రామస్తులు, యువజన సంఘాల సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాజీరావ్ బాబా ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సప్త నిర్వాహకులు బాజీరావు బాబా బోధనలు వినిపించారు. ఈ సందర్భంగా బాబా చిత్రపటాన్ని బంతిపూలతో అలంకరించిన పల్లకిలో ప్రతిష్టించి, భక్తుల దర్శనార్తం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. దేవతా వేషాధారణలో ఉన్న చిన్నారులను రథంపై కూర్చోబెట్టి శోభాయాత్రలో నడిపించారు. కాగా స్థానిక మహిళలు అడుగడుగునా మంగళ హారతులతో బాబా పల్లకికి పూజలు నిర్వహించారు. స్థానిక భక్తులే కాకుండా వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి రావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా భజన పోటీలను నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన కళాకారులు ఆధ్యాత్మిక పాటలతో భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీధర్ చౌదరి, మాజీ సర్పంచ్ విపిన్ ఖోడే, నాయకులు రామ్ రావ్, విశ్వనాథ్, శాలిక్, కుండలిక్, సంబు, విఠోబా, సచిన్ ఖోడే, గ్రామస్తులు పాల్గొన్నారు.