సిరాన్యూస్,బేల
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు అరికట్టాలి : భజరంగ్ దళ్ మండల అధ్యక్షులు ఆకాష్ అగర్కార్
* మండలంలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈసందర్భంగా శివాజీ కూడలి నుండి అంబేద్కర్ కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భజరంగ్ దళ్ ,విశ్వ హిందూ పరిషత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ ర్యాలీ కి మద్దతుగా మండలంలోని పలు వ్యాపార ,వాణిజ్య దుకాణాలు స్వచ్చందంగా ఒక గంట పాటు బందు చేసి ర్యాలీకి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా బేల మండల భజరంగ్ దళ్ మండల అధ్యక్షులు ఆకాష్ అగర్కార్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ హింసకు నిరసనగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో నిరసన చేపట్టాం అని పేర్కొన్నారు.హిందువుల పై హింసకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాని కోరారు.బంగ్లాదేశంలో ఉన్నాటువంటి హిందువులు,దేవాలయాలపైన జరుగుతున్న దాడులకు భద్రత కల్పించాలని కోరారు.వెంటనే ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో చొరవ తీసుకోని తన శాంతి పరిరక్షక దళాన్ని బంగ్లాదేశ్ కు పంపి అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.కార్యక్రమంలో భజరంగ్ దళ్ కమిటీ సభ్యులు,వివిధ హిందూ సంఘ్ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.