సిరా న్యూస్,సూర్యాపేట;
హుజుర్ నగర్ పట్టణంలోని సీతారామ్ నగర్ లో ఓ వ్యక్తి ద్వారా కోదాడ పట్టణానికి చెందిన వ్యక్తి పది అవు దూడలను కొనుగోలు చేసారు. వీటిని బొలెరో వాహనం లో విచక్ష రహితంగా కాళ్ళను తాళ్లతో కట్టి తరలిస్తుండగా బజరంగ్ దళ్ సభ్యులు పట్టుకున్నారు. ఆవు దూడలను మున్సిపాలిటీలో ఉంచారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్బంగా బజరంగ్ దళ్ సభ్యులు శివ మాట్లాడుతూ గతంలో కూడా చాలా సార్లు గోవులను పట్టుకొని గో శాలకు తరలించడం జరిగింది. హుజుర్ నగర్ పట్టణంలో బొలెరో వాహనంకి చుట్టూ పట్టాలు కట్టి గుట్టు చప్పుడు కాకుండా ఆవు దూడలకు తరలిస్తున్నారు. వాహనం మీద డౌట్ వచ్చి అపి చూడగా అందులో దూడలు కనిపించాయి. డ్రైవర్ ను అడగక పొంతన లేని సమాధానం చెప్పడంతో పోలీసులు సమాధానం ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చి ఆవు దూడలను మున్సిపల్ ఆఫీస్ లో దించి వాహనం ను పోలీస్ స్టేషన్ కి తరలించారు. గతంలో చాలా సార్లు ఆవులను కొనేవాళ్ళకి చెప్పడం జరిగింది. బోలోరో వాహనం లో 10 ఆవు దూడలను తరలించారు. అవి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నాయి. తాళ్లతో కట్టివేయడం వల్ల కాళ్ళు వాపుకి గురైయని అన్నారు.