-నేడు ఆయన జయంతి
సిరా న్యూస్;
బకీంచంద్ర ఛటర్జీ 27 జూన్ 1838న బెంగాల్‌లోని కంతల్‌పురాలో జన్మించారు . బెంగాల్‌లో మొదటగా బి.ఏ డిగ్రీ పొందిన వ్యక్తి ఈయనే కావడం విశేషం. తండ్రివలెనే ఈయన కూడా డిప్యూటీ కలెక్టరయ్యాడు. స్వస్థాన వేష భాషల పట్ల గౌరవాభిమానాలు కలవాడు. ఇరవై ఏళ్ళు నిండకముందే ‘లలిత ఓ మానస్’ అనే కవితా సంపుటి రచించాడు. దుర్గేశ్ నందిని, కపాలకుండల, మృణాళిని, దేవీ చౌధురాణి మొదలైన 15 నవలలు రాశాడు. దేశాన్ని మాతృమూర్తిగా సంబో ధిస్తూ… దేశభక్తిని ప్రబోధిస్తూ… ‘వందేమాతరం’ గేయం రాసిన తర్వాత దానిని ‘ఆనంద్‌మఠ్’ న వలలో పొందుపరిచాడు. ఈ న వల వివిధ భారతీయ భాషలలో నికి అనువదించబడడం వలన ఈ గేయం దేశవ్యాప్తంగా ప్రచా రాన్ని పొందింది. ఈ గేయాన్ని బహిరంగంగా గానం చేయటాన్ని నాటి ప్రభు త్వం నిషేధించింది. ఈయన 55 ఏళ్ళ వయస్సులో 8 ఏప్రిల్ 1894 లో కలకత్తాలో పరమపదించారు.
వందేమాతరం వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం
కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం
తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం
త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, సుఫలాం,మాతరం వందేమాతరం
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం
వందేమాతరం
వందేమాతర గేయం యొక్క పూర్తి భావం :
భారతమాత నీకు వందనం గల గల పారే ప్రవాహవాలతో సుభిక్షమైన పాడి పంటలతో
మలయమారుతముల చల్లని గాలులతో, సస్యశ్యామలమైన దేశమా నీకు వందనం
ఓ భారతమాత నీకు వందనాలు
చల్లని వెన్నలలు కలిగిన రాత్రులతో, వికసించిన పువ్వులు పచ్చని చెట్ల శోభతో
స్వచ్చమైన నవ్వులు మధురమైన మాటలతో మాకు సుఖములను వరములనిచ్చు మాత నీకు వందనాలు
ఓ భారతమాత నీకు వందనాలు
కోట్లాది గొంతుకలు నినాధములు కలిగిన, అనేక కోట్ల భుజములు కరములు కలిగిన దేవి అబలలకు బలమునిచ్చు శక్తివి, బహు శక్తులు ధరించిన మాతా , శత్రువులనుంచి మమ్ము రక్షించే మాతల్లి నీకు వందనాలు
ఓ భారతమాత నీకు వందనాలు
నీవే విధ్యవు నీవే ధర్మము నీవే హృదయము నీవే మర్మము మా శరీరములో ప్రాణము నీవే మాలో శక్తివి నీవే, భక్తివి నీవే మా హృదయ మందిరములో ప్రతిమవు నీవే
ఓ భారతమాత నీకు వందనాలు
పలు ఆయుధములు చేతపట్టిన దుర్గామాతావు నీవే , పద్మధలమునందు విహరించే లక్ష్మివి నీవే
జ్ఞానాన్ని ప్రసాదించు శారదా మాతవు నీవే తల్లి నీకు నమస్కరించుచున్నాము కమలా అమలా అతులా సుజలా సుఫలా మాత నీకు వందనం
ఓ భారతమాత నీకు వందనాలు
శ్యామలా సరళా సుశ్మితా అలంకృతా మా భారము మోయు భారత మాత నీకు వందనము.. ఓ భారతమాత నీకు వందనాలు
===============xxxx