bakkaiah: పేదరికంలో ఉన్న బక్కయ్యను ప్రభుత్వమే ఆదుకోవాలి

సిరా న్యూస్, ఓదెల
పేదరికంలో ఉన్న బక్కయ్యను ప్రభుత్వమే ఆదుకోవాలి

సుల్తానాబాద్ మండలం ఐతరాజు పల్లి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం ఉన్నా హనుమాన్ నగర్ కు చెందిన వడ్రంగి పనిచేసుకుంటూ బతుకు జీవనం గడుపుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఎర్రోజు బక్కయ్య భార్య లక్ష్మి గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. లక్ష్మి అనారోగ్యం క్షమించి దీనస్థితిలో లక్ష్మీ మరణించింది. పిల్లలు లేని బక్కయ్య లక్ష్మికి అన్ని తానై భర్త సేవలందించారు. భార్య దూరం కావడంతో బక్కయ్య ఒంటరివాడైనాడు. ఉండడానికి కనీసం ఇల్లు, ఇంటి స్థలం కూడా లేనీ బక్కయ్య ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే పేదల మనిషి విజయ రమణారావు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి త‌న‌ను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ప్రజాప్రతినిధులు గాని మనసున్న మాహరాజులు తోచినంత సహాయం చేయగలరని వేడుకుంటున్నాడు . సహాయం చేయదలచిన వారు కొత్తూరి సుదర్శనం ఫోన్ పే గూగుల్ పే నెంబర్. 9849 2548 11. నెంబర్ కు సహాయం చేయాల‌ని వేడుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *