సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరబాద్ లో ఓ వైపు గణపతి నిజమజ్జనం వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. మరోవైపు ఖైదరాబాద్ వినాయకుడు గంగమ్మ చెంతకు శోభాయత్రగా పయనం అయ్యాడు.. ఇదే సమయంలో బాలాపూర్ గణేశుడితో పాటు పది రోజులు భక్తులతో పూజలను అందుకున్న లడ్డూ రికార్డ్ ధర పలికింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూని బిజేపీ సీనియర్ నేత కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. వేలం పాటలో గత రికార్డ్ ని బీట్ చేస్తూ 30 లక్షల వెయ్యి రూపాయలకు శంకర్ రెడ్డి దక్కించుకున్నారు.
ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం పాట నిబంధనల్లో కొన్ని మార్పులు చేశారు. లడ్డు వేలం పాటలో పాల్గొనడానికి, దక్కించుకోవడానికి ఈ ఏడాది డిపాజిట్ తప్పని సరి చేశారు. అది కూడా గత ఏడాది లడ్డు ధరైన రూ. 27 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం అనే నిబంధన పెట్టారు. దీంతో ఈ లడ్డుని దక్కించుకోవాడానికి చైతన్య స్టిల్స్ అధినేత లింగాల దశరథ్ గౌడ్, సాహెబ్ నగరానికి చెందిన అర్బన్ గ్రూప్ అధినేత ప్రణీత్ రెడ్డి, బాలాపూర్ కి చెందిన బిజేపీ సీనియర్ లీడర్ కొలన్ శంకర్ రెడ్డి , నాదర్గుల్ కి చెందిశ్రీ గీతా డైరీ అధినేత లక్ష్మీనారాయణలు వేలం పాటలో పాల్గొనడానికి కావాల్సిన డిపాజిట్ కట్టారు. చివరికి శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూని 30లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
రికార్డుల వేల
తెలుగు రాష్ట్రాల్లో కనివినీ రీతిలో ఓ వైపు గణపతి విగ్రహాల నిమజ్జనం కోసం గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. మరోవైపు అనేక ప్రాంతాల్లో లడ్డూ వేలం పాటలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అందరి దృష్టి బాలాపూర్ లడ్డు వేలం పాట వైపే ఉండగా.. తాజాగా భాగ్యనగరంలోనే రికార్డ్ స్థాయిలో వేలంపాట సాగింది. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వినాయక నిమజ్జనానికి ముందు నిర్వహించిన లడ్డూ వేలం పాట అదరహో అనిపించింది. గతేడాది రికార్డును బ్రేక్ చేసిన కీర్తి రిచ్మండ్ విల్లాస్ గణేషుడి లడ్డు ఏకంగా కోట్లు పలికింది. ఇక్కడ గణపతి లడ్డూ ధర 1. 87 లక్షల రూపాయిలు పలికింది.ఈ లడ్డూని 25మంది సభ్యులు బృందంగా ఏర్పడి దక్కించుకున్నారు. లడ్డూ వేలం పాటలో వచ్చిన డబ్బుతో ట్రస్ట్ పేదలకు సహాయం చేయనుంది. ఈ డబ్బులతో పేద ప్రజలు, హాస్టల్స్‌లోని విద్యార్ధులకు సహాయ సహకారాలు అందించనున్నారని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. అయితే గత ఏడాది లడ్డూ ప్రసాదం 1 కోటి 26 లక్షల రూపాయల పలకగా.. ఈ సారి ఆ రికార్డును బ్రేక్ చేసింది.