Balka Suman: బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం

బేల, సిరా న్యూస్ 

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. బేల మండలంలోని అంబేద్కర్ కూడలి వద్ద సుమన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్క సుమన్ కు పిచ్చి పట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్, మాజీ జెడ్పీటీసీ రాందాస్ ాక్లే, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంకడే, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండా వార్, కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్యామ్, ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు విఠల్ రావు చంద్రకాంత్ మడావి, ఎంపీటీసీ అరుణ్ సకారాం, సర్పంచులు ఆడె శంకర్, సుదాం రెడ్డి, కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ సామ రూపేష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవినాష్, శంకర్ బోక్రే, విపిన్ రాజ్, మహ్మద్ అక్తర్ బాయి, కన్నె రాజు ఠాక్రే, రమేష్ పటేల్, హిమంత్ పటేల్, సీతారామ్, సాగర్, గులాబ్ నానాజీ, పాండురంగ్, వసంత, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *