సిరా న్యూస్, బోథ్
ఐలమ్మ విగ్రహావిష్కరించిన రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని సోమవారం రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ఆవిష్కరించారు. ఈసందర్బంగా బలరాం జాదవ్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం జరిగిన సాయుధ పోరాట ఉద్యమంలో ఐలమ్మ రాజిలేని పోరాటం చేశారని, ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఐలమ్మ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషమని తెలిపారు. గ్రామ గ్రామాన చరిత్రలో పోరాడిన వీరుల యొక్క విగ్రహాలు బోథ్ మండలంలోని ప్రతి గ్రామాలలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయమని అన్నారు. పిలువగానే వచ్చినందుకు బలరాం ని సంఘం సభ్యులు శాలువాతో సన్మానం చేసి ధన్యావాదాలు తెలిపారు.