Baluri Govardhan Reddy: ఉదారత చాటిన బాలూరి గోవర్ధన్‌ రెడ్డి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

ఉదారత చాటిన బాలూరి గోవర్ధన్‌ రెడ్డి
+ హాకీ క్రీడాకారులకు చేయూత
+ అమరావతికి వెళ్లేందుకు ఆర్థిక సహాయం అందజేత

ఆదిలాబాద్‌ జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్‌ రెడ్డి తన ఉదారత చాటుకున్నారు. జిల్లా హాకీ క్రీడాకారులను మహారాష్ట్రలోని అమరావతి టోర్నమెంట్‌కు తన స్వంత డబ్బులతో పంపించేందుకు ఆర్థిక చేయూతనందించారు. శనివారం ఈ మేరకు క్రీడాకారులను కలిసి, వారితో మాట్లాడారు. ఈ నెల 11 నుంచి అమరావతిలో జర్గనున్న హాకీ టోర్నమెంట్‌లో సత్తాచాటాలని ఆకాంక్షించారు. కాగా గ్రామీణ క్రీడాకారులను ప్రొత్సహించాలనే ఉద్దేశ్యంతో వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హాకీ కోచ్‌లు రవి, శేఖర్, ఖేలో ఇండియా కోచ్‌ శ్రీనివాస్, మేనేజర్‌ హిజాజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *