సిరా న్యూస్, ఆదిలాబాద్ రూరల్:
సీసీ రోడ్డు పనులకు బాలూరి గోవర్ధన్ రెడ్డి భూమి పూజ…
ఆదిలాబాద్ రూరల్ మండలం చాందాతి గ్రామంలో ఈజిఎస్ నిధులు రూపాయలు మూడు లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులకు డిసిసిబి డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి భూమి పూజ చేశారు. బుధవారం ఈ మేరకు గ్రామంలో స్థానిక నాయకులు అధికారులతో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకునే వారని అన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు సైతం నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తున్నామని అన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క కోటాలో రూ. 11 కోట్ల ఈజీఎస్ నిధులలో సగం నిధులు ఎమ్మెల్యేకు కేటాయించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొచ్చిరాం, శ్రీధర్, శ్రీనివాస్, రవి, సుదర్శన్, సురేందర్, ముకీమ్, తదితరులు పాల్గొన్నారు.