సిరా న్యూస్,కడప;
కోత దశలో ఉన్న అరటిపంట అగ్నికి ఆహుతి కావడంతో అన్నదాత తీవ్ర ఆవేదనకు గురయ్యారు.కాసినాయన మండలం సావిశెట్టి పల్లి గ్రామములో రైతు లెక్కల బాలసుబ్బారెడ్డి తొమ్మిది ఎకరాల్లో అరటి మొక్కలు నాటారు.కొద్ది రోజుల్లో పంట కోతకు వచ్చే దశలో అనుకోకుండా వచ్చిన అగ్ని ప్రమాదం తోటను నిలువెల్లా దహించి వేసింది.అరటి ధరలు ఆశాజనకంగా ఉన్న తరుణంలో పంట కాలి బూడిద కావడంతో రూ.30 లక్షలు నష్టపోయినట్లు రైతు వాపోయారు.అరటి పంట తో పాటు బిందు సేద్య పరికరాలు,పైపులు,తదితర సామాగ్రి కూడా కాలిపోయాయని తెలిపారు.అగ్నిమాపక దళం ,రైతులు మంటలను ఆపడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది.ఘటనా ప్రమాదవశాత్తు జరిగిందా..? ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా నిప్పు పెట్టారా..?అనేది తెలియరాలేదు.