సిరాన్యూస్, ఖానాపూర్
ఆవిర్భావ దినోత్సవ సభ ను జయప్రదం చేయండి: బానవత్ గోవింద్ నాయక్
గిరిజన హక్కుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ 27 వ ఆవిర్భావ దినోత్సవ సభను జయప్రదం చేయాలని లంబాడ హక్కుల పోరాట సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూలై 1వ తేదీన హైదరాబాద్ లో జరిగే భారీ సభకు లంబాడీలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తేజవాత్ బేల్లయ్య నాయక్, రాష్ట్ర అధ్యక్షులు కోటియ నాయక్, జిల్లా అధ్యక్షులు, మండల నాయకులు , గ్రామ నాయకులు పాల్గొననున్నారని అన్నారు. ఈ సమావేశంలో జాదవ్ అశోక్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాథోడ్ రోహిదాస్ జిల్లా నాయకులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.